HYUNDAI EXTER LAUNCH: హ్యుందాయ్ ఎక్స్‌టర్ వచ్చేస్తుంది.. 11 వేలకు బుకింగ్! ఇక టాటా పంచ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు

Hyundai Exter 2023 Launch Date in India: 'టాటా పంచ్' ప్రస్తుతం మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను శాసిస్తోంది. టాటాకంపనీ పంచ్‌ను విడుదల చేసి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా.. అమ్మకాలు జోరుగానే ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఇది ఒకటి. ఇప్పుడు హ్యుందాయ్ కూడా మైక్రో ఎస్‌యూవీ విభాగంలో ఓ కారుని తీసుకువస్తోంది. త్వరలో హ్యుందాయ్ నుంచి ఎక్స్‌టర్ రానుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎక్స్‌టర్ కారు ధరలను జూలై 10వ తేదీన ప్రకటించనుంది. సరికొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ కంపెనీ లైనప్‌లో అత్యంత చౌకైన ఎస్‌యూవీ అవుతుందట. ఈ కారు కోసం రూ.11,000 టోకెన్ అమౌంట్‌తో ప్రీ-బుకింగ్ మొదలైంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ 1.2-లీటర్ సహజ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది గ్రాండ్ i10 నియోస్ మరియు మరికొన్ని హ్యుందాయ్ కార్లలో ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 82 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్‌టర్‌ కారులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు AMT ఎంపిక ఇవ్వబడింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ కూడా సీఎన్జీ ఎంపికను కూడా కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ నుంచి వస్తున్న కొత్త మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌ అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యుయల్ కెమెరాలతో కూడిన డాష్‌క్యామ్ మొదలైనవి ఉంటాయి. ఎక్స్‌టర్‌ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగిన మొదటి సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇదే. ఈఎస్సీ, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ మొదలైనవి కూడా ఈ కారు కలిగి ఉంటుంది.

సరికొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ EX, S, SX, SX(O) మరియు SX(O) కనెక్ట్ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది హ్యుందాయ్ లైనప్‌లో అత్యంత చౌకైన ఎస్‌యూవీ అవుతుంది. దీని ధర దాదాపు రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ నేరుగా టాటా పంచ్, సిట్రోయెన్ సి3, నిస్సాన్ మాగ్నైట్ మొదలైన వాటితో పోటీపడుతుంది.

Also Read: Malli Pelli Movie: మళ్లీ పెళ్లి సినిమా ఆపాలంటూ.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పిటిషన్‌!  

Also Read: WTC Final India Playing XI: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌.. భారత్ తుది జట్టు ఇదే! ఐపీఎల్ స్టా‌‌‌‌ర్‌కు చోటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

2023-05-25T11:03:51Z dg43tfdfdgfd