GT VS MI QUALIFIER 2 PLAYING 11: ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్-ముంబై ఫైట్.. తుది జట్లు ఇవే!

MI vs GT IPL 2023 Qualifier 2 Predicted Playing 11: ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. ఇక క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తలపడనుంది. అహ్మదాబా‌ద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం (మే 26) రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2023 ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్, ముంబై జట్లు పోరాడనున్నాయి. 

ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న క్వాలిఫయర్ 2 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. అంతేకాకుండా క్రికెట్ అభిమానులు 'జియో సినిమా' యాప్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించొచ్చు. జియో సినిమాలో ఐపీఎల్ 2023 మ్యాచులను ఫ్రీగా చూడొచ్చని తెలిసిన విషయమే. తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో సహా 12 భాషలలో ఫాన్స్ ఐపీఎల్ మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చు.

ముంబై ఇండియన్స్ బ్యాటర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ మంచి ఫామ్ మీదున్నారు. ముఖ్యంగా సూర్యకుమార్, గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. వీరిని అడ్డుకోవడం గుజరాత్ టైటాన్స్ బౌలర్లకు కష్టమే. బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఏకంగా 5 వికెట్స్ పడగొట్టాడు. క్వాలిఫయర్ 2లో వీరు చెలరేగితే విజయం సులువే.  క్వాలిఫయర్ 2 కోసం ముంబై ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. 

ఐపీఎల్ 2023 ఆరంభం నుంచి ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్ కీలక క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో చేతులెత్తేసింది. వృద్ధిమాన్ సాహా,  దాసున్ షనక, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ విఫలమవడంతో శుభమాన్ గిల్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కీలక మ్యాచ్ కాబట్టి  గిల్ సహా హార్దిక్, మిల్లర్, సాహా చెలరేగాల్సిన అవసరం ఉంది. బౌలర్లు రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ వికెట్స్ తీస్తుండడం కలిసొచ్చే అంశం. గుజరాత్ కూడా ఒక మార్పు తప్ప చెన్నైతో ఆడిన టీంతో బరిలోకి దిగనుంది. విజయ్ శంకర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. 

తుది జట్లు (అంచనా) (GT vs MI IPL 2023 Qualifier 2 Playing 11):

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, దసున్ షనక, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే. 

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, హృతిక్ షోకీన్, ఆకాష్ మధ్వల్. 

Also Read: Xiaomi 14 Pro Launch Date: సంచలనం సృష్టించడానికి వస్తున్న షియోమీ స్మార్ట్‌ఫోన్.. 5000 బ్యాటరీ!  

Also Read: Hyundai Exter Launch: హ్యుందాయ్ ఎక్స్‌టర్ వచ్చేస్తుంది.. 11 వేలకు బుకింగ్! ఇక టాటా పంచ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

 

2023-05-25T13:33:54Z dg43tfdfdgfd