పెన్నార్‌ లాభం 75 కోట్లు

హైదరాబాద్‌, మే 24: ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల సంస్థ పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.75.43 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది నమోదైన రూ.41.91 కోట్లతో పోలిస్తే 79.98 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 27.76 శాతం పెరిగి రూ.2,894.62 కోట్లకు చేరుకున్నట్టు కంపెనీ డైరెక్టర్‌ సునీల్‌ తెలిపారు.

2023-05-24T18:50:02Z dg43tfdfdgfd