నీటి సమస్య రావొద్దు : కార్పొరేటర్ సామల హేమ

నీటి సమస్య రావొద్దు :  కార్పొరేటర్ సామల హేమ

సీతాఫల్‌‌మండి, వెలుగు: లో ప్రెజర్‌‌‌‌, ఓవర్‌‌‌‌ ఫ్లో ఫిర్యాదులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీతాఫల్​మండి కార్పొరేటర్​సామల హేమ అన్నారు. శ్రీనివాస్​నగర్ లోని వాటర్‌‌‌‌ వర్క్స్‌‌ ఆఫీస్‌‌లో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డివిజన్‌‌లో  నీటి సమస్య ఉండొద్దన్నారు. పెండింగ్‌‌లో ఉన్న పనులను తొందరగా పూర్తి చేయాలని ఆఫీసర్లను కోరారు.

కార్యక్రమంలో వాటర్ బోర్డు డీజీఎం కృష్ణ, మేనేజర్​నవ్య  పాల్గొన్నారు. నామాలగుండులో నిర్మిస్తున్న డివిజన్ ఆఫీసు పనులను ఆఫీసర్లతో కలిసి సామల హేమ పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆఫీసర్లు, కాంట్రాక్టర్‌‌‌‌ను ఆదేశించారు.

©️ VIL Media Pvt Ltd.

2023-05-25T05:58:42Z dg43tfdfdgfd