తెలంగాణకు ప్లూమ్‌ హైదరాబాద్‌లో కేంద్రం

  • 100 మందికి ఉద్యోగావకాశాలు

హైదరాబాద్‌, మే 24 (నమస్తే తెలంగాణ): కమ్యూనికేషన్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ (సీఎస్‌పీ)కు సంబంధించిన ప్రముఖ క్లౌడ్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ప్లూమ్‌ హైదరాబాద్‌లో తమ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇందులో 100 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. బుధవారం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్లూమ్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (సీడీవో) కిరణ్‌ ఎడారా, చీఫ్‌ ఓపెన్‌సింక్‌, హార్డ్‌వేర్‌ ఆఫీసర్‌ లీమ్‌ వో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటు వివరాలు వెల్లడించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ నాగేంద్రప్రసాద్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఐటీ రంగంలో అసమాన ప్రతిభ చూపుతున్న హైదరాబాద్‌కు తమ సేవలను విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్లూమ్‌ సీడీవో కిరణ్‌ ఎడారా ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ప్రపంచస్థాయి ఇంజినీరింగ్‌ ప్రతిభ, ప్లూమ్‌ యెక్క సాంకేతికతతో అద్భుతమైన సేవలను అందించవచ్చన్నారు. ఈ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఎకోసిస్టంకు సహకరించేందుకు ఆసక్తిగా ఉన్నామని, ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్లకుపైగా క్రియాశీల స్థానాల్లో ప్లూమ్‌ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఓపెన్‌, హార్డ్‌వేర్‌-స్వతంత్ర, క్లౌడ్‌ నియంత్రిత పరిష్కారాలు, స్మార్ట్‌ హోమ్‌ సేవలను ప్లూమ్‌ అందిస్తున్నది.

2023-05-24T19:35:04Z dg43tfdfdgfd