జర్మనీలో అర్థిక సంక్షోభం
న్యూఢిల్లీ: జర్మనీ గ్రాస్ జీడీపీ ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో 0.3 శాతం తగ్గింది. కిందటేడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌లో కూడా ఈ దేశ జీడీపీ 0.5 శాతం పడిపోయింది. యూరప్‌లోని అతిపెద్ద ఎకానమీ అయిన జర్మనీ అఫీషియల్‌గా రెసిషన్ (ఆర్థిక మాంద్యం)లోకి జారుకుంది. వరుసగా రెండు క్వార్టర్లలో జీడీపీ తగ్గితే రెసిషన్ వచ్చినట్టు. కానీ, ఈ దేశంలో ఎంప్లాయ్‌మెంట్ జనవరి –మార్చి క్వార్టర్‌లో మెరుగుపడగా, ఇన్‌ఫ్లేషన్ ఇదే టైమ్‌లో దిగొచ్చింది. వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉండడంతో ప్రజల ఖర్చులు, ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గుతున్నాయి. జీడీపీ నెంబర్లు జర్మనీ ప్రభుత్వాన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయని ఎనలిస్టులు అంటున్నారు. కిందటి నెలలో ఈ కంట్రీ తమ గ్రోత్ అంచనాలను రెండింతలు పెంచిందని గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఎకానమీ 0.4 శాతం పెరుగుతుందని జర్మనీ ప్రభుత్వం అంచనావేసింది. గతంలో ఈ నెంబర్ 0.2 శాతం ఉంటుందని ప్రకటించింది. జర్మనీలో ఇన్‌ఫ్లేషన్ ఏప్రిల్‌లో 7.2 శాతంగా రికార్డయ్యింది.
యూఎస్ జీడీపీ ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో 1.3 శాతం (ఏడాది ప్రాతిపదికన) వృద్ధి నమోదు చేస్తుందని అక్కడి ప్రభుత్వం అంచనావేసింది. ఎకానమీ స్లో డౌన్‌లో ఉండడంతో గ్రోత్ పెద్దగా ఉండకపోవచ్చని తెలిపింది. కానీ, అంతకు ముందు వేసిన 1.1 శాతం అంచనా కంటే కొద్దిగా పెంచింది. కన్జూమర్ల స్పెండింగ్ పెరిగిందని యూఎస్ కామర్స్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.
©️ VIL Media Pvt Ltd. 2023-05-26T02:29:02Z dg43tfdfdgfd