ఏఆర్ఎం ఆగ్రోఇండస్ట్రీస్​ ఆస్తులపై ఆరా..పౌర సరఫరాల సంస్థ చైర్మన్​ రవీందర్​సింగ్​

ఏఆర్ఎం ఆగ్రోఇండస్ట్రీస్​ ఆస్తులపై ఆరా..పౌర సరఫరాల సంస్థ చైర్మన్​ రవీందర్​సింగ్​

హుస్నాబాద్​, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ఏఆర్​ఎం ఆగ్రోస్​ ఇండస్ట్రీస్​ ఆస్తులపై పౌర సరఫరాల సంస్థ చైర్మన్​ సర్ధార్​ రవీందర్​సింగ్ ఆరా తీసినట్టు తెలిసింది. గురువారం తన స్నేహితుడి ఇంట్లో జరిగిన ఓ ప్రైవేట్​ కార్యక్రమానికి అటెండ్​అయిన ఆయన.. అనంతరం జిల్లా సివిల్‌‌‌‌ సప్లై అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ హరీశ్‌‌‌‌తో పలు రైస్​మిల్లులను పరిశీలించారు.  ఇందులో భాగంగానే ఏఆర్​ఎం ఆగ్రోస్​ ఇండస్ట్రీస్‌‌‌‌ మిల్లును పరిశీలించి యజమాని ఆస్తుల వివరాలను తెలుసుకున్నట్టు సమాచారం.  

కొద్ది నెలల కింద మిల్లు​ యజమాని 9,523 మెట్రిక్​ టన్నుల వడ్లను మాయం చేసినట్టు తేలడంతో ఆఫీసర్లు ఆయపై కేసు పెట్టారు.  ప్రభుత్వం ఈ మిల్లుకు 2021‌‌‌‌‌‌‌‌లో వానాకాలం, యాసంగి సీజన్ కలిసి  11,427 మెట్రిక్ టన్నుల వడ్లను కేటాయించింది.  అయితే మిల్లు యజమాని 2 వేల మెట్రిక్ టన్నుల వడ్లను మాత్రమే బియ్యంగా మరాడించి సీఎంఆర్ కింద అప్పగించారు. మిగితా 9,523 మెట్రిక్ టన్నుల వడ్లను బియ్యంగా చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్టు తేలింది.  దీని విలువ రూ.27.76కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. ప్రస్తుతంం రికవరీ ప్రాసెస్‌‌‌‌ నడుస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.

2023-05-26T05:44:04Z dg43tfdfdgfd