ఈ‑కామర్స్‌లోనూ రిలయన్సే ముందు
–న్యూఢిల్లీ: దేశపు ఈ–కామర్స్ మార్కెట్లోనూ దూసుకెళ్లే అవకాశాలు ముకేశ్ అంబానీ లీడర్‌షిప్‌లోని రిలయన్స్‌కే ఎక్కువగా ఉన్నాయని ఒక రిపోర్టు వెల్లడించింది. అతి పెద్ద రిటెయిల్ స్టోర్ నెట్వర్క్, టెలికం ఆపరేషన్స్, డిజిటల్ మీడియా కార్యకలాపాలతో రిలయన్స్‌కి ఈ–కామర్స్‌లోనూ గట్టి పట్టు దొరికే ఛాన్స్ ఉంటుందని ఆ రిపోర్టు పేర్కొంది. ఇండియా ఈ–కామర్స్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల దాకా ఉండొచ్చని బెర్న్‌స్టీన్ తాజా రిపోర్టు లో పేర్కొంది. ఇండియాలోని ఈ–కామర్స్ మార్కెట్లో మూడు కంపెనీలు ముందుకెళ్తున్నాయని, ఆ కంపెనీలు అమెజాన్, వాల్‌మార్ట్ (ఫ్లిప్‌కార్ట్), రిలయన్స్‌లని వివరించింది. డిస్ట్రిబ్యూషన్ ఛాలెంజెస్ ఉండే ఇండియా మార్కెట్లో ముందడుగు వేయాలంటే ప్లానింగ్ వేరుగా ఉండటం అవసరమని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ ఈ రిపోర్టులో వెల్లడించింది. ఆఫ్‌లైన్, ఆన్లైన్, ప్రైమ్..ఇలా మూడు విభాగాలలోనూ పట్టు సాధిస్తేనే ఇండియా మార్కెట్లో సక్సెస్ సాధ్యమవుతుందని పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పటిష్టంగా ఉండటంతోపాటు, కస్టమర్లకు ఆన్లైన్ ప్లేయర్లతో పోలిస్తే మెరుగైన ప్రైసింగ్(మంచి రేట్లు) ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది.
దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ లెవెల్లో డిజిటల్ ఎకో సిస్టమ్‌ను నిర్మిస్తోంది. ఈ గ్రూప్‌లోని టెలికం కంపెనీ జియోకి 43 కోట్ల మంది మొబైల్ సబ్‌స్క్రయిబర్లున్నారు. మరోవైపు రిటెయిల్ కంపెనీకి దేశంలో 18,300 రిటెయిల్ స్టోర్లున్నాయి. ఈ కంపెనీ అమ్మకాలు 30 బిలియన్ డాలర్లు. మొత్తంగా చూస్తే ఈ కంపెనీలో డిజిటల్ వాటా 17–18 శాతం (6 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ రిపోర్టు తెలిపింది. ఇలా అన్ని విభాగాలలోనూ చొచ్చుకుపోతున్న రిలయన్స్...అమెజాన్, వాల్‌మార్ట్ (ఫ్లిప్‌కార్ట్)లకు దేశంలో గట్టిపోటీ ఇవ్వగలుగుతుందని రిపోర్టు పేర్కొంది. రిటెయిల్ బిజినెస్‌లో 4 లక్షల మందికి రిలయన్స్ ఉద్యోగాలు ఇచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే కొత్తగా 69 వేల మంది ఉద్యోగులు జాయినయ్యారు. దేశంలోని రిటెయిల్ ఇండస్ట్రీతో పోలిస్తే రిలయన్స్‌లో ఉద్యోగాలు మానేసే వాళ్ల శాతం తక్కువగానే ఉంటోందని కూడా బెర్న్‌స్టీన్ రిపోర్టు వెల్లడించింది.
ఇండియా ఈ–కామర్స్ మార్కెట్ చాలా పెద్దది. ఈ మార్కెట్ ఇంకా చొచ్చుకుపోవడానికి ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని రిపోర్టు వివరించింది. 2025 నాటికి 150 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ రాబోయే అయిదేళ్లలో రెట్టింపవుతుందని పేర్కొంది. 23 బిలియన్ డాలర్ల గ్రాస్ మెర్చండైజ్ వాల్యూతో ఫ్లిప్‌కార్ట్ టాప్‌ప్లేస్‌లో ఉండగా, 18–20 బిలియన్ డాలర్ల గ్రాస్ మర్చండైజ్ వాల్యూతో అమెజాన్ సెకండ్ ప్లేస్‌లో నిలుస్తోంది. ఈ రెండు కంపెనీలకు కలిపి మార్కెట్లో 60 శాతం వాటా ఉంది. 5.7 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ అమ్మకాలతో రిలయన్స్ ఇప్పుడు మూడో ప్లేస్‌లో నిలుస్తోంది. ఏజియోతో ఫ్యాషన్ కేటగిరీలో, జియో మార్ట్‌తో ఈ–గ్రోసరీ సెగ్మెంట్లో రిలయన్స్ దూసుకెళ్తోంది. రిటెయిల్ నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్, డిజిటల్ ఎకో సిస్టమ్‌లతో పాటు, సొంత దేశం కావడంతో రెగ్యులేషన్స్పరంగానూ దేశీయ ఈ–కామర్స్‌లో సింహభాగం వాటా సాధించడానికి రిలయన్స్‌కే మెరుగయిన అవకాశాలున్నాయని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ ఈ రిపోర్టులో స్పష్టం చేసింది. 2016 లో 24 మిలియన్లుగా ఉన్న ఎఫ్లుయెంట్ హౌస్‌హోల్డ్స్ (ఏటా 15 వేల డాలర్లకు మించి ఆదాయం ) 2025 నాటికి 50 మిలియన్లకు చేరనున్నారంది.
ఇండియాలో 4 జీ డేటా రేట్లు చాలా తక్కువని, పర్కాపిటా మొబైల్ డేటా కన్జంప్షన్లో నెలకు 8 జీబీతో ఇండియా టాప్‌లో నిలుస్తోందని వివరించింది. దేశంలో 53 కోట్ల మందికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందని, చైనా తర్వాత రెండో పెద్ద యూజర్ బేస్ ఉన్న డిజిటల్ ఎకానమీ ఇండియానేనని కూడా బెర్న్‌స్టీన్ రీసెర్చ్ రిపోర్టు పేర్కొంది. 2025 నాటికి దేశంలోని ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుతుందని, ఇందులో 33 శాతం అంటే 33 కోట్ల మంది ఆన్లైన్ షాపర్లుగా మారతారని అంచనా వేసింది.
©️ VIL Media Pvt Ltd. 2023-05-26T02:14:08Z dg43tfdfdgfd