ఈవీ కంపెనీలతో ఉబర్ జోడీ
న్యూఢిల్లీ: రైడ్- హెయిలింగ్ యాప్ ఉబర్ బుధవారం భారతదేశంలోని పలు ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలతో ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో భారతదేశంలో 25 వేల ఎలక్ట్రిక్ కార్లను తన ప్లాట్‌ఫారమ్‌లో చేర్చేందుకు ఈవీ ఫ్లీట్ పార్ట్నర్లు అయిన లిథియం అర్బన్ టెక్నాలజీస్, ఎవరెస్ట్ ఫ్లీట్ ప్రైవేట్ లిమిటెడ్, మూవ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2024 నాటికి ఢిల్లీలో 10 వేల ఈవీ టూవీలర్లను అందుబాటులో తేవడానికి జిప్ ఎలక్ట్రిక్‌తో జతకట్టినట్లు ఉబర్ తెలిపింది.
రూ.వెయ్యి కోట్ల విలువైన ఈవీ లోన్లను ఇప్పించడానికి సిడ్బీతో ఒప్పందం చేసుకుంది. ఉబర్ ఈవీలను వేగంగా ఛార్జింగ్ చేయడానికి జీఎంఆర్ గ్రీన్ ఎనర్జీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జూన్ నుండి ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో ఉబర్ గ్రీన్ వెహికల్స్‌ను అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. ఉబర్ గ్రీన్ 15 దేశాల్లోని 100కు పైగా నగరాల్లో ఉంది. 2040 నాటికి తమ ప్లాట్‌ఫారమ్‌లోని ప్రతి వెహికల్ఈవీనే ఉండేలా చూస్తామని ఉబర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మొబిలిటీ బిజినెస్ ఆపరేషన్స్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ చెప్పారు.
©️ VIL Media Pvt Ltd. 2023-05-25T03:28:40Z dg43tfdfdgfd