అదానీ గ్రూప్‌లో పెట్టుబడితో ఎల్‌ఐసీకి భారీ లాభాలు

గత కొన్నాళ్లుగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్‌ కార్పొరేషన్‌ ను ప్రైవేట్‌ పరం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను చాలా వరకు మోడీ ప్రభుత్వం ప్రైవేట్‌ పరం చేస్తూ వచ్చింది. 

ప్రభుత్వంను నడిపించడం భారంగా మారిన ఈ సమయంలో ఇలాంటి వ్యాపారాలు చేయడం మరింత కష్టంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వంకు చెందిన కొందరు ఆ మధ్య వాదించడంతో ఎల్‌ఐసీ ని కచ్చితంగా ప్రైవేట్ పరం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 

మోడీ ప్రభుత్వంకు చాలా మంది వ్యతిరేకంగా ఈ విషయమై ఇప్పటికే మాట్లాడటం జరిగింది. నష్టాల్లో ఉన్న ఎల్‌ఐసీ కి ఎట్టకేలకు కాస్త ఊరట దక్కింది. అదానీ గ్రూప్ లో పెట్టిన పెట్టుబడులకు భారీగా లాభాలు రావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ఎల్‌ఐసీ సంస్థ.

అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ.44,670 కోట్లు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 5,500 కోట్ల రూపాయలు అదనంగా లాభాలను దక్కించుకున్నట్లుగా మార్కెట్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. 

యూఎస్‌ షార్ట్‌ సెల్లర్ హిండెన్‌ బర్గ్ గత కొంత కాలంగా చేస్తున్న ఆరోపణల కారణంగా అదానీ స్టాక్స్ రేట్లు పతనం అవుతూ వచ్చాయి. అయితే ఇటీవల మళ్లీ అదానీ గ్రూప్ మార్కెట్‌ విలువ పెరగడంతో పాటు స్టాక్స్‌ యొక్క రేట్లు భారీగా పెరుగుతున్నాయి. 

Also Read: Ram Siya Ram Song : ఆదిపురుష్‌ అప్డేట్.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా

దాంతో అదానీ గ్రూప్ మళ్లీ మార్కెట్‌ లో ముందు ముందుకు సాగుతూ దూసుకు పోతూనే ఉంది. సుప్రీం కోర్టు నియమిత నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి షేర్ల ధరలను కృత్రిమంగా పెంచినట్లుగా వస్తున్న వార్తలకు సమాధానం ఇవ్వడం జరిగింది. దీంతో మళ్లీ ఇన్వెస్టర్లు అదానీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

మార్కెట్‌ లో అదానీ గ్రూప్ మళ్లీ పుంజుకున్న కారణంగా ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ యొక్క ఆదాయం గణనీయంగా పెరిగింది అంటూ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. గడచిన కొన్నాళ్లుగా ఎల్‌ఐసీ భవిష్యత్తు గురించి ఆందోళన ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని... ముందు ముందు ఎల్ ఐ సీ మరింతగా లాభాలను దక్కించుకుంటుంది అంటూ మార్కెట్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

2023 మార్చి చివరి వరకు ఎస్‌ఐసీకి అదానీ పోర్ట్స్ లో 9.12 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ లో 4.26 శాతం, ఏసీసీలో 6.41 శాతం మరియు అంబుజా సిమెంట్స్ లో 6.3 శాతంఇంకా అదానీ టోటల్ గ్యాస్‌ లో 6.02 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. అదానీ గ్రూప్ మెల్ల మెల్లగా మెరుగు పడుతున్న నేపథ్యంలో మళ్లీ ఐసీసీ పుంజుకుంటుంది అంటూ మార్కెట్ వర్గాల వారు ధీమాగా చెబుతున్నారు.

Also Read: Indian Railways Facts: ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్.. ఎందుకంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

2023-05-25T09:33:48Z dg43tfdfdgfd